J&K: లోయలో పడిపోయిన ఆర్మీ వాహనం

by S Gopi |

జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున ఆర్మీ వాహనం లోయలో దొర్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

J&K: లోయలో పడిపోయిన ఆర్మీ వాహనం
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో భారత ఆర్మీ వాహనం లోయలో పడి ముగ్గురు సైనికులు మరణించారు. మృతుల్లో అమిత్ కుమార్, సుజీత్ కుమార్, మాన్ బహదూర్‌గా గుర్తించినట్లు ఆర్మీ అధికారులు ధృవీకరించారు. జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున ఆర్మీ వాహనం బ్యాటరీ చష్మా సమీపంలో 700 అడుగుల లోతు ఉన్న లోయలో దొర్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన స్థలంలో సైనికులతో పాటు వారి వస్తువులు చెల్లచెదురుగా పడిపోయాయి. ఆదివారం ఉదయం 11.30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరగ్గా, భారత సైన్యంతో పాటు జమ్మూకశ్మీర్ పోలీసులు, ఎస్‌డీఆర్ఎఫ్, స్థానిక స్వచ్ఛంద సేవకులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు.

Next Story