- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AAP: ఒక్కరోజే మూడు హత్యలా?.. బీజేపీపై ఆప్ విమర్శలు
దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఒక్కరోజే మూడు హత్యలు జరిగాయి. కాగా.. ఢిల్లీ శాంతిభద్రతలపై బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా మండిపడింది.

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఒక్కరోజే మూడు హత్యలు జరిగాయి. కాగా.. ఢిల్లీ శాంతిభద్రతలపై బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇక, ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆప్ నేత, మాజీ ముఖ్యమంత్రి అతిషి స్పందించారు. ఈ సందర్భంగా సీలంపూర్ హత్య దేశ రాజధానిలో శాంతిభద్రతల ఎలా ఉన్నాయె తెలియజేస్తుందన్నారు. వరుస హత్యలు జరుగుతుంటే.. ఢిల్లీ పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా నేరాలు పెరిగిపోతున్నాయని విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలనలో శాంతిభద్రతలు మెరుగుపడటం లేదని ఆరోపించారు. తాము అధికారంలో ఉన్న పదేళ్లు శాంతియుత పరిస్థితులు ఉన్నాయని మాజీ సీఎం అతిషి తెలిపారు. కాగా.. ఈ దారుణాలపై ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కాషాయ పార్టీలపై విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన పేర్కొన్నారు.
మూడు హత్యలు
అయితే, సెంట్రల్ ఢిల్లీలోని నబీ కరీం ప్రాంతంలో జరిగిన చిన్న రోడ్డు ప్రమాదం తీవ్ర వాగ్వాదానికి దారి తీయడంతో మహేంద్ర అనే వ్యక్తిని లక్కీ, సాగర్ అనే ఇద్దరు సోదరులు కలిసి స్క్రూ డ్రైవర్‌తో కొట్టి చంపేశారు. వీరు ఇద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అలాగే, సెంట్రల్ ఢిల్లీలోని పంజాబీ బస్తీలో జరిగిన రెండవ సంఘటనలో ఆశిష్ ఆనంద్ అనే వ్యక్తిని ప్లాన్ ప్రకారం కొందరు దుండగులు వచ్చి కత్తితో పొడిచి చంపారు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా.. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఇక, మూడో ఘటన ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్‌లో చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలుడు కునాల్‌ని కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను గుర్తించి అరెస్టు చేయడానికి రెండు బృందాలను నియమించినట్లు తెలిపారు. ఇక, సీఎం రేఖాగుప్తా సైతం ఈ వరుస మర్డర్లపై స్పందించింది. ఈ ఘటనలో కమిషనర్ తో మాట్లాడినట్లు పేర్కొంది.






