Dogs Killed : ఫిఫా వరల్డ్ కప్ కోసం..30లక్షల కుక్కల హతం!

by Y. Venkata Narasimha Reddy |

పాపం మూగజీవులైన వీధి కుక్కలకు ఏం తెలుసు..ఫుట్ బాల్ పోటీలు తమకు ప్రాణాలమీదకొస్తాయని. మొరాకో ప్రభుత్వం(Moroccan Government)తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు ఆ దేశంలోని వీధి కుక్కల పాలిట మరణ శాసనమైంది.

Dogs Killed : ఫిఫా వరల్డ్ కప్ కోసం..30లక్షల కుక్కల హతం!
X

దిశ, వెబ్ డెస్క్ : పాపం మూగజీవులైన వీధి కుక్కలకు ఏం తెలుసు..ఫుట్ బాల్ పోటీలు తమకు ప్రాణాలమీదకొస్తాయని. మొరాకో ప్రభుత్వం(Moroccan Government)తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు ఆ దేశంలోని వీధి కుక్కల పాలిట మరణ శాసనమైంది. దేశంలో జరుగనున్న ఫిఫా వరల్డ్ కప్(FIFA World Cup)2030 నిర్వహణ నేపథ్యంలో వీధి కుక్కలు లేకుండా చేసేందుకు అక్కడి ప్రభుత్వం దాదాపు 30 లక్షల(3 Millions)కుపైగా వీధి కుక్కలను హతమార్చాలని(Stray Dogs Killed) నిర్ణయించింది.

కుక్కలను చంపడానికి అత్యంత విషపదార్థాలు ఇవ్వడం, కాల్చి చంపడం, ఇనుప రాడ్లతో తీవ్రంగా కొట్టడం ద్వారా చంపడం ప్రారంభించింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల జంతు హక్కుల సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొరాకోలో వీధి కుక్కలను చంపడాన్ని నిషేధించే చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇలా చేయడం అమానవీయమని మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసిస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఉద్యమకారులు ప్రభుత్వంపై విరుచుకపడుతున్నారు.

ప్రఖ్యాత ప్రైమటాలజిస్ట్, జంతు హక్కుల న్యాయవాది జేన్ గూడాల్ ఈ సమస్యపై ఫిఫా జోక్యం చేసుకోవాలని కోరారు. మొరాకో ఆతిథ్య బాధ్యతలను నిలిపివేయాలని, ఈ ఘోరాన్ని ఆపేందుకు ఫిఫా వెంటనే చర్యలు తీసుకోవాలని గూడాల్ పుట్‌బాల్ గవర్నింగ్ బాడీకి బహిరంగ లేఖ రాశారు. వీధి కుక్కల నిర్మూలనపై వెల్లువెత్తుతున్న విమర్శలతో ఫిఫా ప్రత్యామ్నాయ మార్గంపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థలతో పిఫా, మొరాకో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నాయి. 2030లో మొరాకో దేశం స్పెయిన్‌, పోర్చుగల్‌లతో కలిసి ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ పోటీలను నిర్వహించనుంది.

Next Story