- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chhattisgarh: ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోలు హతం
చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంద్రావతి జాతీయ ఉద్యానవనం ప్రాంతంలోని అడవిలో భద్రతా బలగాలు, పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్ లో ముగ్గురిని హతమార్చినట్లు జరిగాయని బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ పి తెలిపారు. ఈ ఆపరేషన్ లో బీజాపూర్, దంతేవాడ జిల్లాల రిజర్వ్ గార్డ్ (DRG) సిబ్బంది, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), కోబ్రా 202, 210 బెటాలియన్లు పాల్గొన్నాయని ఆయన చెప్పారు. ఘటనా స్థలం నుండి ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ జరుగుతోందని వెల్లడించారు. దీంతో, ఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్ గఢ్ లో జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో 138 మంది మావోయిస్టులు చనిపోయారు. వారిలో 122 మందిని బీజాపూర్‌తో సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ డివిజన్‌లో హతమార్చారు.






