Shopian: జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం

by Shamantha N |

జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో (Jammu and Kashmir Encounter) ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Shopian: జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో (Jammu and Kashmir Encounter) ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన నలుగురు టెర్రరిస్ట్‌లు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆర్మీ, పారామిలిటరీ దళాలు మంగళవారం ఉదయం ఆపరేషన్‌ చేపట్టారు. పహెల్గాం ఉగ్రదాడికి కారణమైన లష్కరే ఉగ్రవాది, స్థానిక నివాసి అయిన షాహిద్‌ను ఆ ప్రాంతంలో గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో అక్కడ ఎన్‌కౌంటర్‌ జరిగింది. తొలుత కుల్గామ్‌లో మొదలైన్ ఎన్ కౌంటర్.. ఆ తర్వాత షోపియాన్‌ జిల్లా వరకు విస్తరించింది. అయితే, మొదట ఒక ఉగ్రవాదని హతమార్చిన భద్రతా బలాగాలు.. ఇప్పుడు మరో ఇద్దర్ని చంపారు. జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో, ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలిస్తున్నారు. ఇంకా ఆప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

పహెల్గాం ఉగ్రదాడి తర్వాత..

ఏప్రిల్ 22న జరిగిన జమ్ముకశ్మీర్ లోని పహెల్గామ్ లో ఉగ్రదాడి జరిగింది. ముష్కరులు టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డారు. ఆ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడికి ఆదిల్ హుస్సేన్ థోకర్, అలీభాయ్, హషీమ్ ముసా లు కారణమని భావిస్తున్నారు. ఇకపోతే, 'టెర్రర్ ఫ్రీ కాశ్మీర్' పోస్టర్లను భద్రతా సంస్థలు ఉంచిన కొద్ది క్షణాల్లోనే ఈ పరిణామం జరిగింది. మరోవైపు, పహెల్గామ్ ఉగ్రదాడి జరిగిన కొద్ది రోజులకే జమ్ముకశ్మీర్ అధికారులు ఏప్రిల్ 25న బిజ్‌బెహారాలోని థోకర్ నివాసాన్ని ఐఈడీలను పెట్టి పేల్చేశారు.బైసారన్ లోయపై దాడి చేయడంలో థోకర్ కీలక పాత్ర పోషించాడని అధికారులు భావిస్తున్నారు.

Next Story