- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Navy Warships: నేవీ అమ్ములపొదిలో మరో మూడు అస్త్రాలు
నేవీ అమ్ములపొదిలో మరో మూడు అస్త్రాలు(3 Indian Navy Warships) వచ్చి చేరాయి. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్షీర్ యుద్ధనౌకలను నేవీలో చేర్చుకున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: నేవీ అమ్ములపొదిలో మరో మూడు అస్త్రాలు(3 Indian Navy Warships) వచ్చి చేరాయి. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్షీర్ యుద్ధనౌకలను నేవీలో చేర్చుకున్నారు. ముంబయిలోని నేవల్ డాక్‌యార్డ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ (PM Modi) హాజరయ్యారు. ఆ తర్వాత మోడీ(PM Modi) ప్రసంగించారు. ‘‘దేశ రక్షణలో సైనికుల సేవలు ఎనలేనివి. దేశ భద్రత కోసం వారు ప్రాణాలను సైతం లెక్క చేయరు. నౌకాదళం బలోపేతానికి మరో అడుగు ముందుకు పడింది. తొలిసారిగా మూడు ఆయుధ వ్యవస్థలను ఒకేసారి ప్రారంభించుకున్నాం. ఇవన్నీ భారత్‌లో తయారైనవే. వీటితో నేవీకి నూతన బలం, దార్శనికత అందుతుంది’’ అని వివరించారు. ఈ మూడింటి వల్ల రక్షణ రంగంలో ప్రపంచనాయకుడిగా భారత్ ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు బలోపేతం అవుతాయన్నారు. స్వావలంబన వైపు దేశాన్ని నడిపిస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సముద్రతీర రక్షణ కోసం మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు.
మూడు యుద్ధనౌకలు..
ఐఎన్‌ఎస్ సూరత్ ప్రాజెక్ట్ 15B స్టెల్త్ డిస్ట్రాయర్ (Project 15B stealth destroyer class) తరగతి కింద అభివృద్ధి చేస్తున్న నాలుగో యుద్ధనౌక. ప్రపంచంలోనే భారీ, అత్యాధునిక డిస్ట్రాయర్ యుద్ధ నౌకల్లో ఇదొకటి. ఇందులో స్వదేశీ వాటా 75 శాతం. ఈ యుద్ధ నౌకలో అధునాతన ఆయుధ-సెన్సర్ వ్యవస్థలు ఉన్నాయి. నెట్‌వర్క్ సెంట్రిక్ సామర్థ్యం దీని సొంతం. ఐఎన్‌ఎస్ నీలగిరి.. పీ17ఏ స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్టులో తొలి యుద్ధనౌక. శత్రువును ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో దీన్ని తయారుచేశారు. ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్.. స్కార్పీన్-క్లాస్ ప్రాజెక్ట్ 75 కింద తయారు చేస్తున్న ఆరో, చివరి జలాంతర్గామి.






