- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతీ ఐదుగురిలో ముగ్గురు క్యాన్సర్‌తో మృతి
గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ (గ్లోబోకాన్) 2022, గ్లోబల్ హెల్త్ అబ్జర్వేటరీ (జీహెచ్ఓ) డేటాబేస్‌ను ఉపయోగించి ఇండియాలో వయసు రిత్యా, లింగం రిత్యా 36 క్యాన్సర్ ధోరణులపై అధ్యయనం చేసింది.

- క్యాన్సర్ రోగుల్లో మహిళలే ఎక్కువ
- క్యాన్సర్ బాధితుల్లో ఇండియా మూడో స్థానం
- ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ రోగులు ఎక్కువ
- వెల్లడించిన లాన్సెట్ జర్నల్
దిశ, నేషనల్ బ్యూరో: ఇండియాలోని ప్రతీ ఐదుగురు క్యాన్సర్ రోగుల్లో ముగ్గురు ఆ వ్యాధి కారణంగా చనిపోతున్నారు. పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నట్లు ప్రపంచ క్యాన్సర్ డేటా విశ్లేషణలో తేలింది. అమెరికాలో మరణాల నిష్ఫత్తి ప్రతీ నలుగురిలో ఒకరుగా ఉండగా.. చైనాలో ఇది ఇద్దరిలో ఒకటిగా ఉందని 'ది లాన్సెట్ రీజనల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఆసియా' జర్నల్‌లో ఈ ఫలితాలు ప్రచురించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధ్యయనం ప్రకారం క్యాన్సర్ బాధితుల సంఖ్య చైనా, అమెరికాల తర్వాత ఇండియాలోనే ఎక్కువ అని తెలుస్తోంది. ప్రపంచ క్యాన్సర్ మరణాల్లో 10 శాతం ఇండియాలో నమోదు అవుతున్నాయి. ఆ తర్వాత స్థానంలో చైనా ఉందని తెలిపింది. రాబోయే రెండు దశాబ్దాల్లో ఇండియాలో క్యాన్సర్‌తో సంభవించే మరణాలను తగ్గించడంలో బలమైన సవాలను ఎదుర్కోవలసి ఉంటుందని అంచనా వేశారు. జనాభా వయస్సు పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ కేసులు కూడా ఏటా 2 శాతం మేర పెరుగుదల ఉంటుందని అధ్యయనంలో తేలింది.
గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ (గ్లోబోకాన్) 2022, గ్లోబల్ హెల్త్ అబ్జర్వేటరీ (జీహెచ్ఓ) డేటాబేస్‌ను ఉపయోగించి ఇండియాలో వయసు రిత్యా, లింగం రిత్యా 36 క్యాన్సర్ ధోరణులపై అధ్యయనం చేసింది. ఇండియాలో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయితే ఐదుగురిలో ముగ్గురు మృతి చెందే అవకాశం ఉందని తెలిపారు. ఇండియాలో మహిళలు ఎక్కువగా క్యానస్ర్ బారిన పడుతున్నారు. రొమ్ము క్యాన్సర్ అంత్యంత ప్రబలమైన క్యాన్సర్‌గా కొనసాగుతుంది. స్త్రీ, పురుషుల్లో 13.8 శాతం మేర కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక గర్భాశయ క్యాన్సర్ మూడో స్థానంలో ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ దాదాపు 30 శాతం కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 24 శాతానికి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. గర్భాశయ క్యాన్సర్ 19 శాతంగా ఉండగా.. వారిలో 20 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. పురుషుల్లో నోటీ క్యాన్సర్ అత్యంత సాధారణంగా నమోవుతుంది. ఏటా 16 శాతం కొత్త కేసులు నమోదవుతున్నాయి. వీటి తర్వాత శ్వాస కోశ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. మధ్య వయస్కులు, వృద్ధుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం 8 నుంచి 10 శాతంగా ఉందని అధ్యయనంలో తేలింది. దాదాపు 70 శాతం మరణాలు మధ్య వయస్కులు, వృద్ధులలో సంభవిస్తున్నాయి.






