- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
J&K: జమ్మూకశ్మీర్‌ను ముంచెత్తిన వరదలు.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి
పొంగిపొర్లుతున్న ప్రవాహానికి శిథిలాల్లో ట్రక్కులు ఇరుక్కుపోయాయి, పలు వాహనాలు కొట్టుకుపోయాయి.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని భారీ వర్షం కారణంగా వరదలు ముంచెత్తాయి. రాంబన్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 100 మందిని రక్షించినట్టు ఆదివారం ఓ ప్రకటనలో అధికారులు తెలిపారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లో వరదల కారణంగా దాదాపు 40 ఇళ్లు దెబ్బతిన్నాయి. పొంగిపొర్లుతున్న ప్రవాహానికి శిథిలాల్లో ట్రక్కులు ఇరుక్కుపోయాయి, పలు వాహనాలు కొట్టుకుపోయాయి. చాలా చోట్ల విద్యుత్ అంతరాయం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని, అయినప్పటికీ చిక్కుకున్న గ్రామస్తులను రక్షించడానికి పోలీసు సిబ్బంది ప్రయత్నిస్తున్నదని అధికారులు వివరించారు. ముఖ్యంగా లోయ ప్రాంతానికి ప్రధాన రహదారిగా ఉన్న జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి మూతపడటం, ఇతర ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి నష్రీ, బనిహాల్ మధ్య దాదాపు డజనుకు పైగా కొండచరియలు విరిగిపడ్డాయి. విపత్తు కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలలో అనేక చెట్లు నేలకూలాయి. గడిచిన ఐదేళ్ల కాలంలో ఈ స్థాయిలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచడం ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమాసియా ప్రాంతంలో ఏర్పడిన ప్రత్యేక వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని పేర్కొంది.






