- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఛత్తీస్‌గఢ్‌లో 28 మంది మావోయిస్టుల లొంగుబాటు
by Muthe.Rajitha |
మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది.

X
దిశ, వెబ్ డెస్క్ : మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో సతమతం అవుతున్న పార్టీకి.. మరోసారి పార్టీ సభ్యుల లొంగుబాటు కోలుకోలేని దెబ్బ తగిలినట్టైంది. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పుర్ జిల్లా పోలీస్ హెడ్ ఆఫీసులో మంగళవారం 28 మంది మావోయిస్టులు భద్రతా బలగాల ముందు లొంగిపోయారు. వీరిలో మాడ్ డివిజన్ కమిటీ సభ్యులు, పీఎల్‌జీఏ, ఏరియా కమిటీ సభ్యులు, మిలటరీ దళం కమాండర్, ఎల్‌ఓఎస్, జనతానా సర్కార్ సభ్యులు ఉన్నారు.
దండకారణ్య ప్రాంతంలో కీలక పాత్ర పోషించిన ఈ 28 మందిపై మొత్తం రూ.89 లక్షల రివార్డు ప్రకటించి ఉన్నట్లు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు బస్తర్ డివిజన్‌లో 287 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు వెల్లడించారు.
Next Story






