- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూరత్ ఎయిర్ పోర్టులో 28 కేజీల బంగారం పట్టివేత
సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో(Surath Airport) అక్రమంగా తరలిస్తున్న బంగారం(Gold) భారీ మొత్తంలో పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో(Surath Airport) అక్రమంగా తరలిస్తున్న బంగారం(Gold) భారీ మొత్తంలో పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది. దుబాయ్ నుంచి వస్తున్నా ఒక దంపతుల వద్ద నుంచి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది 28 కిలోల బంగారం పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ జంట దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ IX-174లో వచ్చినట్లు గుర్తించారు. సాధారణ దుస్తుల్లో ఉన్న వీరి కదలికల్లో, ప్రవర్తనలో తేడా ఉండటంతో ఓ CISF ఇంటెలిజెన్స్ విభాగం అధికారి, అనుమానం వ్యక్తం చేయడంతో, కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకొని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో మహిళ వద్ద 16 కిలోలు, పురుషుడి వద్ద 12 కిలోల బంగారం పేస్ట్‌ను శరీరంపై గట్టిగా కట్టిన ఫాబ్రిక్ బెల్ట్‌లలో దాచినట్లు కనుగొన్నారు. దీని విలువ సుమారు రూ. 23 కోట్లుగా అంచనా వేశారు. దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.






