- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
28 మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు అరెస్ట్
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వం.. దేశంలోని అక్రమ వలసదారుల ఏరివేత పై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వం.. దేశంలోని అక్రమ వలసదారుల ఏరివేత పై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో దేశంలోని వివిధ నగరాల్లోని అక్రమ వలసదారులను గుర్తించే పనిలో పోలీసులు, ఇతర అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా సౌత్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ పోలీసుల బంగ్లాదేశ్ సెల్ 28 మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను గుర్తించి అరెస్టు చేసింది. వారు భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్నట్లు తేల్చింది.
విచారణలో వారంత పశ్చిమ బెంగాల్‌లోని ఖుల్నా సరిహద్దు ద్వారా ఇతర వ్యక్తులతో పాటు భారత దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని ఒప్పుకున్నారని తెలిపారు.. మొత్తం 28 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసి.. ఇప్పుడు తాత్కాలిక నిర్బంధ కేంద్రంలో ఉంచినట్లు అధికారులు స్పష్టం చేశారు. అలాగే వారిని దేశం నుంచి బహిష్కరించడానికి అవసరమైన చట్టపరమైన లాంఛనాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. భారత ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటి వరకు మొత్తం 235 మంది అక్రమ బంగ్లాదేశీయులను బహిష్కరించినట్లు ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.






