- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైవేలపై ప్రమాదాలు.. 6 నెలల్లో 27 వేలమంది మృతి : మంత్రి గడ్కరీ

దిశ, వెబ్‌డెస్క్: గడిచిన ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా ఉన్న హైవేలపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 27 వేల మంది మరణించినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) వెల్లడించారు. ఈ ఏడాది జనవరి - జూన్ మధ్యకాలంలో మరణాలు నమోదైనట్లు తెలిపారు. బుధవారం జరిగిన రాజ్యసభలో.. సభ్యులు రోడ్డుప్రమాదాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను పేర్కొన్నారు. హైవేలపై జరిగిన ప్రమాదాల్లో గడిచిన ఆర్నెలల్లో 26,770 మంది మృతి చెందగా.. గతేడాది జరిగిన ప్రమాదాల్లో 52,609 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.
ఢిల్లీ - మీరఠ్ ఎక్స్ ప్రెస్ వే, ట్రాన్స్ - హరియాణా, ఢిల్లీ - ముంబై ఎక్స్ ప్రెస్ వే వంటి హై ట్రాఫిక్ ఏరియాల్లో NHAI అడ్వాన్స్ డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేసిందన్నారు. గడిచిన మూడేళ్లలో 1,12,561 కిలోమీటర్ల జాతీయ రహదారులకు రోడ్డు భద్రతా ఆడిట్ నిర్వహించామని కూడా వివరించారు.






