- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tahawwur Rana: భారత్ చేరిన 26/11 సూత్రధారి తహవ్వుర్ రాణా
భారత ఇంటెలిజెన్స్, ఇన్వెస్టిగేటివ్ అధికారుల సంయుక్త బృందంతో కలిసి రాణాను ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు.

దిశ, నేషనల్ బ్యూరో: 2008 ముంబై ఉగ్రదాడులకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తహవ్వూర్ రాణాను అమెరికా నుంచి గురువారం ఢిల్లీకి చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత ఇంటెలిజెన్స్, ఇన్వెస్టిగేటివ్ అధికారుల సంయుక్త బృందంతో కలిసి రాణాను ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. విమానం ఢిల్లీ విమానాశ్రయంలోని పాలం టెక్నికల్ ఏరియాలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, సాయుధ కమాండోల కాన్వాయ్ సహా గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య అతడిని తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ప్రధాన కార్యాలయానికి, అక్కడ హై-సెక్యూరిటీ ఇంటరాగేషన్ సెల్‌లో ఉంచనున్నారు. ముంబైలో మూడు రోజుల పాటు ఉగ్రవాద దాడి కారణంగా 166 మంది మరణించిన ఘటనలో పాత్రకు సంబంధించి రాణా విచారణను ఎదుర్కోవలసి ఉంది. అనంతరం కస్టడీ కోసం ఢిల్లీ కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. తహవ్వూర్ రాణా నేరపూరిత కుట్ర, భారత్‌కు వ్యతిరేకంగా యుద్ధం చేయడం, హత్య, ఫోర్జరీ, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద ఉల్లంఘనల ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. దాడులు జరిగిన 15 ఏళ్ల తర్వాత న్యాయం కోసం భారత్‌కు రాణా అప్పగింత ప్రధాన దౌత్యపరమైన, చట్టపరమైన పురోగతికి సంకేతం. అంతకుముందు తహవ్వుర్ రాణా రాక, తరలింపు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. స్వాట్ కమాండోలను విమానాశ్రయం వద్ద మోహరించారు.






