- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సముద్రంలో పెను విషాదం.. పడవ బోల్తా పడి 250 మంది గల్లంతు
అండమాన్ సముద్రంలో పడవ బోల్తా! 250 మంది రోహింగ్యా శరణార్థులు గల్లంతు. బంగ్లాదేశ్ నుంచి మలేషియా వెళ్తుండగా ఈదురుగాలుల వల్ల ప్రమాదం.

దిశ, వెబ్ డెస్క్: సముద్రంలో భారీ నౌక ప్రమాదం సంభవించి 250 మంది గల్లంతయ్యారు. ఈ షాకింగ్ సంఘటన అండమాన్ సముద్రంలో చోటు చేసుకుంది. మెరుగైన జీవితం కోసం ఆశతో మలేషియాకు సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న దాదాపు 250 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. దక్షిణ బంగ్లాదేశ్‌లోని టేక్‌నాఫ్ (Teknaf) ప్రాంతం నుండి బయలుదేరిన ఈ పడవ, అండమాన్ సముద్రంలోకి రాగానే ప్రకృతి ప్రకోపానికి గురైంది. పడవలో ఉన్న వారంతా రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులుగా గుర్తించారు.
ఈదురుగాలుల ఉధృతితో ప్రమాదం..
తాజా నివేదికల ప్రకారం.. ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న ఈ పడవ మలేషియా వైపు వెళ్తుండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సముద్రంలో పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీయడం, కెరటాల ఉద్ధృతి పెరగడంతో పడవ నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం కూడా ఈ ప్రమాద తీవ్రత పెరగడానికి ఒక కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులు ప్రాణ భయంతో కేకలు వేసినా, సముద్రం మధ్యలో కావడంతో తక్షణ సాయం అందలేదు.
కొనసాగుతున్న గాలింపు చర్యలు..
ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే తీర రక్షక దళాలు, సంబంధిత అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే, వాతావరణం ఇంకా అనుకూలించకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. గల్లంతైన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇంతవరకు ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారు అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రోహింగ్యా శరణార్థులు తరచుగా ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలు చేస్తూ ప్రాణాలు కోల్పోతుండటం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.






