- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Krutrim Techie: ఓలా కృత్రిమ్ టెకీ ఆత్మహత్య.. మరోసారి పని ఒత్తిడిపై చర్చ
బెంగళూరులో టెకీ ఆత్మహత్య కలకలం రేపింది. ఓలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలోని కృత్రిమ్ లో పనిచేస్తున్న యువ ఇంజినీర్ నిఖిల్ సోమవంశీ బెంగళూరులో మే 8న ఆత్మహత్య చేసుకున్నాడు.

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరులో టెకీ ఆత్మహత్య కలకలం రేపింది. ఓలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలోని కృత్రిమ్ లో పనిచేస్తున్న యువ ఇంజినీర్ నిఖిల్ సోమవంశీ బెంగళూరులో మే 8న ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా.. ఆత్మహత్యకు సంబంధించిన పోస్టు రెడ్డిట్ లో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో, కంపెనీలోని పని సంస్కృతిపై నెటిజన్లు ప్రశ్నలు లేవనత్తుతున్నారు. కాగా.. ఈ విషయంపై ఓలా కృత్రిమ్ ప్రతినిధి స్పందించారు. “మే 8న మా అత్యంత ప్రతిభావంతులైన యువ ఉద్యోగులలో ఒకరైన నిఖిల్ విషాదకరంగా మరణించడం పట్ల మేము చాలా బాధపడ్డాము. ఈ చాలా క్లిష్ట సమయంలో అతని కుటుంబం, స్నేహితులు, ప్రియమైన వారికి అండగా ఉంటాం. ఈ ఘటన జరిగిన సమయంలో నిఖిల్ వ్యక్తిగత సెలవులో ఉన్నాడు. ఏప్రిల్ 8న తన మేనేజర్‌ను సంప్రదించి తనకు విశ్రాంతి అవసరమని తెలిపాడు. వెంటనే వ్యక్తిగత సెలవులు మంజూరు అయ్యాయి. ఆ తర్వాత ఏప్రిల్ 17న, తాను బాగానే ఉన్నానని, అదనపు విశ్రాంతి తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని మేనేజర్ ని సంప్రదించాడు. ఆ తర్వాత సెలవులు పొడిగించాం" అని ఓలా కృతిమ్ ప్రతినిధి అన్నారు. ఈ దుఃఖ సమయంలో నిఖిల్ కుటుంబానికి, తమ ఉద్యోగులకు పూర్తి మద్దతిస్తామన్నారు. ఈ ఘటనపై అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అవసరమైన విధంగా సాయం అందిస్తూనే ఉంటామని పేర్కొన్నారు.
10 నెలల క్రితమే కృత్రిమ్ లో చేరిన..
నిఖిల్ సోమవంశీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) నుంచి ఇటీవల గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్నాడు. 10 నెలల క్రితమే క్రుత్రిమ్‌లో చేరాడు. అతడు మానసిక ఆరోగ్య సమస్యలను చూపుతూ తన మరణానికి రెండు వారాల ముందు ఆఫీసుకు రావడం మానేశాడని ఓలా పేర్కొంది. మరోవైపు, ఓలా కృత్రిమ్ లో పని సంస్కృతిపై మాజీ ఉద్యోగి చేసిన పోస్టు వైరల్ గా మారింది. “ కీలకమైన ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తున్న ముగ్గురు సభ్యుల బృందంలో నిఖిల్ కూడా భాగం. మిగతా ఇద్దరు సభ్యులు వైదొలిగాక మొత్తం పనిభారం అతనిపై పడింది.. దీంతో అతను వర్క్ తొందరగా కంప్లీట్ కావడం లేదంటూ సీనియర్ మేనేజర్ రాజ్‌కిరణ్ తరుచూ ఉద్యోగులను, ముఖ్యంగా ఫ్రెషర్లను తిట్టాడు” అని మాజీ ఉద్యోగి ఆరోపించారు. రాజ్‌కిరణ్‌కు నిర్వహణ నైపుణ్యాలు లేవని.. నిత్యం ఉద్యోగులపై అరుస్తూ కనిపిస్తాడని పేర్కొన్నారు. ఆఫీస్ మీటింగ్ సమయంలో కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం చాలా బాధాకరమైనది అని రెడ్డిట్ పోస్ట్‌లో చేసిన ఆరోపణలను కూడా మాజీ ఉద్యోగి అంగీకరించాడు.






