- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశ రాజధాని ఢిల్లీలో 25 మంది ఇల్లీగల్ బంగ్లాదేశీయులు
ఆపరేషన్ సిందూర్ తర్వాత అనేక ప్రధాన నగరాల్లో కంటిన్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తూ.. అక్రమ వలసదారులను తమ దేశాలకు తిరిగి పంపుతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వ అక్రమ వలసదారుల (Illegal immigrants)పై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక ప్రధాన నగరాల్లో కంటిన్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తూ.. అక్రమ వలసదారులను తమ దేశాలకు తిరిగి పంపుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో 25 బంగ్లాదేశ్ వాసులు (25 Bangladeshis) ఇల్లీగల్‌గా నివసిస్తున్నారని గుర్తించి ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులపై సౌత్ ఈస్ట్ జిల్లాకు సంబంధించిన అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఐశ్వర్య శర్మ మాట్లాడుతూ.. అరెస్టైన వారిలో 13 మహిళలు, 12 పురుషులు ఉన్నారని.. వారు బంగ్లాదేశ్‌లో ఉన్న వ్యక్తులతో ఒక యాప్ ద్వారా కమ్యూనికేషన్ చేస్తున్నారు.
పోలీసులు వీరిని త్వరలో బంగ్లాదేశ్‌కు డిపోర్ట్ (Deportation to Bangladesh) చేయనున్నట్లు తెలిపారు. ఢిల్లీ ఫారెనర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) సహకారంతో ఈ డిపోర్టేషన్ ప్రారంభమైంది. మాహిపాల్పూర్‌లో నివసిస్తున్న ఇల్లీగల్ బంగ్లాదేశ్ వాసులపై సమాచారాన్ని పోలీసులు అందుకున్నారు. స్పష్టమైన సమాచారాన్ని ఆధారంగా, పోలీసులు గుర్తించిన వ్యక్తుల వద్ద ఐడెంటిటి డాక్యుమెంట్లు అడిగి పూర్తి విచారణ చేశారు. వారు సరైన డాక్యుమెంట్లు చూపలేకపోయారు. వారంతా 11 సంవత్సరాలుగా అక్రమంగా భారత్‌లో ఉన్నారని అధికారులు గుర్తించారు. అక్రమంగా భారత్ లో నివసిస్తున్న వారిని బంగ్లాదేశ్‌కు డిపోర్ట్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.






