25 మంది పెళ్లి కొడుకులు.. ఒక్కతే పెళ్లి కూతురు.. అసలు విషయం తెలిస్తే షాకవుతారు!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-20 08:13:35  IST  )

ఇప్పటి వరకు నిత్య పెళ్లి కొడుకులనే చూశారు కదా..

25 మంది పెళ్లి కొడుకులు.. ఒక్కతే పెళ్లి కూతురు.. అసలు విషయం తెలిస్తే షాకవుతారు!
X

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి (Marriage) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత మధురమైన ఘట్టం. అందుకే పెళ్లి విషయంలో ఎన్నో కలలు కంటుంటారు. అయితే, ఇటీవల కాలంలో పెళ్లికాని ప్రసాద్‌లు ఎక్కువవుతున్నారు. ఇలాంటి వారినే టార్గెట్ చేసిన ఓ యువతి నిత్య పెళ్లికూతురు (Bride) అవతారమెత్తింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 25 మందిని (Married 25 members) పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నగలు, డబ్బు, విలువైన వస్తువులతో ఉడాయిస్తున్న ఈ కిలేడిని తాజాగా రాజస్థాన్ (Rajastan) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే..

ఉత్తరప్రదేశ్‌లోని (Uttarpradesh) మహారాజ్‌గంజ్‌‌కు చెందిన అనురాధ పాశ్వాన్(23) అనే యువతి గతంలో ఓ ఆసుపత్రిలో పనిచేసేది. భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకుని మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు మకాం మార్చింది. అక్కడ ఓ పెళ్లిళ్ల రాకెట్‌తో చేతులు కలిపి వయసు పెరుగుతూ పెళ్లిళ్లు ఆలస్యం అయ్యే యువకులను టార్గెట్‌గా చేసుకుంది. అనంతరం వారితో పెళ్లి కుదుర్చుకుని చట్టబద్ధంగానే పెళ్లిళ్లు చేసుకునేది. ఆ తర్వాత అనురాధ కొద్దిరోజులు అత్తారింట్లో ఉండి, వీలు చిక్కగానే బంగారం, నగదు, విలువైన వస్తువులతో ఉడాయించేది. అనంతరం వేరే ప్రాంతానికి మకాం మార్చి కొత్త పేరు, కొత్త గుర్తింపు కార్డులతో 7 నెలల్లోనే ఏకంగా 25 మందిని మోసం చేసింది.

అనురాధ చేతిలో మోసపోయిన సవాయ్ మాధోపూర్‌కు చెందిన విష్ణు శర్మ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు పెళ్లిళ్లు కుదుర్చే ఏజెంట్లకు రూ.2 లక్షలు చెల్లించి అనురాధతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నానని, ఏప్రిల్ 20న ఆమెతో పెళ్లయిందని, మే 2న ఆమె నగలతో పారిపోయిందని శర్మ పోలీసులకు తెలిపాడు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఒక కానిస్టేబుల్‌ను పెళ్లి కొడుకుగా నమ్మించి, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Next Story