- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంత్యక్రియలకు వెళ్లి 25 మంది మృతి.. అంతా క్షణాల్లోనే..
బంధువు అంత్యక్రియలకు హాజరై.. తిరిగి వస్తుండగా వారంతా ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన గుంటలో బోల్తా పడింది.

X
దిశ, వెబ్‌డెస్క్: బంధువు అంత్యక్రియలకు హాజరై.. తిరిగి వస్తుండగా వారంతా ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన గుంటలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘోరప్రమాదం సౌత్ వెస్ట్రన్ కెన్యాలోని న్యాంజా ప్రావిన్స్ లో జరిగింది. లోకల్ ట్రాఫిక్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి పీటర్ మైనా తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు రౌండ్ అబౌట్ వద్దకు వస్తున్న క్రమంలో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పి గుంటలో బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో సుమారు 25 మంది మరణించగా.. వారిలో మహిళలు, పురుషులతో పాటు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story






