- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య ఆ కోరిక తీర్చలేదని.. పెళ్లి అయిన 25 రోజులకే మరో వివాహం చేసుకున్న భర్త..
ఉత్తరప్రదేశ్ గోండాలో అదనపు వరకట్నం కారణంగా ఓ వివాహితను టార్చర్ చేశారు భర్త, అత్తమామలు. ఇక ఆమె ఎక్స్‌ట్రా డౌరీ ఇవ్వలేదని డిసైడ్ అయిపోయి.. మరో పెళ్లి చేసుకున్నాడు భర్త. అది కూడా మొదటి భార్యతో వివాహం జరిగిన 25రోజులకే ఇదంతా చేశాడు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ గోండాలో అదనపు వరకట్నం కారణంగా ఓ వివాహితను టార్చర్ చేశారు భర్త, అత్తమామలు. ఇక ఆమె ఎక్స్‌ట్రా డౌరీ ఇవ్వలేదని డిసైడ్ అయిపోయి.. మరో పెళ్లి చేసుకున్నాడు భర్త. అది కూడా మొదటి భార్యతో వివాహం జరిగిన 25రోజులకే ఇదంతా చేశాడు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. జూన్ 2న సవితా పాఠక్‌కు రంజిత్‌తో ఘనంగా వివాహం జరిగింది. పెళ్లికి ముందు అడిగిన కట్నకానుకలన్నీ ఇచ్చి పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. కానీ మ్యారేజ్ జరిగిన కొద్ది రోజులకే అదనపు కట్నం వేధింపులు స్టార్ట్ అయ్యాయి. లక్ష రూపాయలు, ఓ బైక్ తీసుకురావాలని శారీరకంగా వేధించారు. తన పుట్టింట్లో పరిస్థితిని వివరించినా పట్టించుకోకపోగా మరింత టార్చర్ చేశారు. అయినా భరించింది సవిత.
కానీ జూన్ 27న అదే గ్రామానికి చెందిన మరో మహిళతో పారిపోయిన భర్త.. కుటుంబ సభ్యుల మద్దతుతో రెండో పెళ్లి చేసుకున్నాడని, తనను మోసం చేశాడని ఎస్పీకి తన బాధను చెప్పుకుంది. తన భర్త నూతన వధువును ఇంటికి తీసుకొచ్చాడని.. తనను బయటకు వెళ్లిపోమంటున్నాడని, న్యాయం చేయాలని కోరింది. దీంతో భర్తతోపాటు ఆరుగురు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.






