ప్రియుడిని చంపిన హంతకురాలికి మరణశిక్ష

by Ajay Maddhiboyina |

ప్రియుడిని చంపిన హంతకురాలికి మరణశిక్ష
X

- సహకరించిన మామయ్యకు మూడేళ్ల కఠిన కారాగారం

- నిర్దోషిగా విడుదలైన తల్లి

- కేరళ కోర్టు సంచలన తీర్పు

దిశ, నేషనల్ బ్యూరో:

తన పెళ్లికి అడ్డు వస్తాడేమో అన్న కారణంతో ప్రియుడిని ఇంటికి పిలిచి విషమిచ్చి చంపిన గ్రీష్మ (24) అనే యువతికి కేరళలోని నెయ్యట్టింకర అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులో తనపై దయ చూపాలని నిందితురాలు కోర్టును వేడుకున్నా.. నేర తీవ్రత దృష్ట్యా కోర్టు ఆమె అభ్యర్థనను పట్టించుకోలేదు. 2022లో తన ప్రియుడు షారోన్ రాజు(23)ను ఇంటికి పిలిచి, ఆయుర్వేదిక్ డ్రింక్ పేరిట విషమిచ్చింది. అక్కడి నుంచి వెళ్లిన తర్వాత షారోన్ రాజు వాంతులు చేసుకొని ఆసుపత్రిలో చేరాడు. కొన్ని రోజుల చికిత్స తర్వాత మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయాడు. చనిపోయే ముందు షారోన్ రాజు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా గ్రీష్మ, ఆమె మామయ్య నిర్మలా కుమార్ , తల్లి సింధుపై పోలీసులు హత్యనేరం మోపారు. కాగా, రెండేళ్ల పాటు సాగిన విచారణ అనంతరం.. ఇది అరుదైన కేసులో కోర్టు పేర్కొంది. నిందితురాలి వయసును పరిగణలోకి తీసుకొని, కేసు తీవ్రతను తగ్గించలేమని పేర్కొంది. ఈ కేసులో సాక్ష్యాలు మాయం చేయడానికి ప్రయత్నించిన గ్రీష్మ మామయ్య నిర్మలా కుమార్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కాగా, గ్రీష్మ తల్లి సింధుపై ఎలాంటి ఆరోపణలు రుజువు కాకపోవడంతో ఆమెను నిర్దోషిగా వదిలేస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

Next Story