- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు.. ఢిల్లీ, ముంబైల్లో 225 విమానాలు రద్దు
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో మిడిల్‌ఈస్ట్ దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడంతో భారత్‌లో విమాన సర్వీసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో మిడిల్‌ఈస్ట్ దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడంతో భారత్‌లో విమాన సర్వీసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 100 విమానాలు (60 బయలుదేరు, 40 రాక) రద్దుకాగా, ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 125 విమానాలు (67 బయలుదేరు, 58 రాక) రద్దయ్యాయి. తిరుచిరాపల్లి విమానాశ్రయంలో మార్చి 1న 17 రాకలు, 16 బయలుదేరే విమానాలు రద్దయ్యాయి. మార్చి 2న కూడా 3 రాకలు, 2 బయలుదేరే విమానాలు నిలిపివేశారు. గగనతల ఆంక్షల నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 110కిపైగా విమానాలను రద్దు చేసినట్లు జాతీయ మీడియా స్పష్టం చేసింది.
మొత్తం 350 విమానాలు రద్దు..!
ఇండియాలో మొత్తం ఇప్పటి వరకు 350 విమానాలు రద్దు అయినట్లు వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయంగా కూడా విమాన సేవలు నిలిచిపోయాయి. దుబాయ్‌కు ఎమిరేట్స్ విమానాలు తాత్కాలికంగా నిలిపివేయగా, ఖతార్ గగనతల మూసివేతతో దోహా హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు నిలిచాయి. శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ 12 విమానాలను రద్దు చేసింది. ఇదిలా ఉండగా, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా జాతీయ సంతాప దినాలు ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా విమానయానంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.






