లోయలో పడిన ట్రక్కు.. 22 మంది కార్మికులు మృతి

by Muthe.Rajitha |

అరుణాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

లోయలో పడిన ట్రక్కు.. 22 మంది కార్మికులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : అరుణాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని అంజావ్ జిల్లా హయులియాంగ్-చాగ్లాగాం రోడ్డులో ఈనెల 7న అస్సాం టిన్సుకియా జిల్లా గెలాపుఖురి టీ ఎస్టేట్‌కు చెందిన 22 మంది రోజువారీ కార్మికులు ప్రయాణిస్తున్న ట్రక్ అదుపు తప్పి సుమారు వెయ్యి అడుగుల లోతు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 14 మంది మృత దేహాలు వెలికి తీశారు. ఒకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా మరో 7 మంది ట్రక్ శిథిలాల కింద మరణించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ప్రమాదం జరిగి 5 రోజులు గడుస్తున్నా ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అరుణాచల్ పోలీసులు, సైన్యం, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్‌లు శిథిలాల కింద మృతదేహాల వెలికితీతలో తీవ్రంగా కష్టపడుతున్నారు. కాగా మృతులంతా అస్సాంకు చెందిన దినసరి కూలీలు.

Next Story