Cloud Burst: మరో 10 మంది మృతి.. 22కు చేరిన సంఖ్య

by Gantepaka Srikanth |

జమ్మూకశ్మీర్‌ను మెరుపు వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.

Cloud Burst: మరో 10 మంది మృతి.. 22కు చేరిన సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌ను మెరుపు వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. చోసిటీలో గురువారం భారీ క్లౌడ్‌బరస్ట్‌ (Massive Cloudburst) చోటు చేసుకొంది. దీంతో ఒక్కసారిగా మెరుపు వరదలు సంభవించాయి. ఈ వరదల్లో చిక్కుకుని మొత్తం 22 మంది మృతిచెందారు. మాచైల్‌ మాతా మందిరానికి వెళ్లే యాత్రికులు.. ఈ దారి నుంచి వెళ్తుండటంతో వరదల్లో చిక్కుకుని 22 ప్రాణాలు కోల్పోయారు. రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఇప్పటికే చోసిటీకి తరలి వెళ్లాయి. అదనపు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, హెలికాప్టర్లను సిద్ధం చేస్తున్నారు. మాచైల్‌ మాతా మందిరం సముద్ర మట్టానికి సుమారు 2,800 మీటర్ల ఎత్తులో ఉంది. జులై 25న ఈ యాత్ర మొదలైంది. జమ్మూ (Jammu Kashmir) డివిజన్‌ నుంచి వేల సంఖ్యలో యాత్రికులు ఇక్కడకు వచ్చారు. సెప్టెంబర్‌ 5వ తేదీన ఈ యాత్ర ముగియనుంది. ఇప్పటికే వరదల కారణంగా యాత్రను కూడా నిలిపివేశారు.

Next Story