UGC: దేశంలో 22 ఫేక్ యూనివర్సిటీలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే?

by Prasad Jukanti |

విద్యార్థులకు యూజీసీ బిగ్ అలర్ట్ ఇచ్చింది.

UGC: దేశంలో 22 ఫేక్ యూనివర్సిటీలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో 22 ఫేక్ యూనివర్సిటీలు (fake universities) ఉన్నాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) హెచ్చరించింది. ఎలాంటి అనుమతులు లేకుండానే డిగ్రీ కోర్సులను నిర్వహిస్తున్నయని ఈ సంస్థలు జారీ చేసే డిగ్రీలకు ఎలాంటి విలువ లేదని పేర్కొంది. వీటిలో దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 9 ఫేక్ యూనివర్సిటీలు ఉండగా ఐదు యూపీలో ఉన్నాయని మిగతావి కేరళ, పశ్చిమబెంగాల్, మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరిలో నిర్వహిస్తున్నట్లు యూజీసీ తెలిపింది. విద్యార్థులు ఏదైనా సంస్థలో చేరే ముందు ఆ సంస్థ యూజీసీ గుర్తించిన జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవాలని సూచించింది. యూజీసీ వెల్లడించిన ఫేక్ యూనివర్సిటీల జాబితా కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Next Story