21 శతాబ్దం మహిళలదే.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోడీ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-04-13 06:43:27  IST  )

కొత్త చరిత్ర లిఖించడానికి చేరువలో ఉన్నామని మోడీ అన్నారు. నారీశక్తి వందన సమ్మేళనంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

21 శతాబ్దం మహిళలదే..  మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోడీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: 21వ శతాబ్దం మహిళలదే అని, మహిళలు ముందుండి అభివృద్ధిని నడిపిస్తారని ఆశిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) పేర్కొన్నారు. మహిళా సాధికారిత లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. ఇవాళ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‍లో నారీ శక్తి వందన్ ( Nari Shakti Vandan) కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మోడీ ఈ సందర్భంగా మాట్లాడుతూఅభివృద్ధి ప్రయాణంలో అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నామని 21వ శతాబ్ధంలో ఇది కీలక నిర్ణయం అన్నారు. కొత్త చరిత్ర లిఖించేందుకు చేరువలో ఉన్నామన్నారు. చట్టసభలో మహిళలకు రిజర్వేషన్ల కోసం (Women Reservation Bill) పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం కాబోతోందని, మహిళా రిజర్వేషన్ బిల్లుకు 2023 నుంచి అన్ని పక్షాలు మద్దతు ఇస్తున్నాయన్నారు.

2029లోగా మహిళా రిజర్వేషన్లు:

కేంద్రం తీసుకునే ఈ నిర్ణయం మహిళలకు అంకితం చేస్తున్నామని మోడీ చెప్పారు. స్వప్నాల సాకారంతో పాటు భవిష్యత్ సంకల్పాలను నెరవేరుస్తుందని, భారత ప్రజాస్వామ్యాన్ని మహిళలు మరింత బలోపేతం చేస్తారన్నారు. సామాజిక న్యాయం కేవలం పురుషుల వల్ల మాత్రమే కాదన్నారు. మహిళా బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఈ నెల 16 నుంచి ఈ బిల్లుపై పార్లమెంట్ చర్చిస్తుందన్నారు. 2029 లోగా మహిళా రిజర్వేషన్ల బిల్లును అమలు చేయాలన్నారు. దేశాభివృద్ధిలో మహిళలది కీలక పాత్ర అని సామాజిక న్యాయం ఇప్పుడు కేవలం నినాదం కాదన్నారు. మహిళల కలలకు రెక్కలు తొడుగుతున్నాం. దేశంలో రాష్ట్రపతి, ఆర్థిక మంత్రి వంటి పదవుల్లో మహిళలు ఉన్నారు.

Next Story