- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Karachi jail: కరాచీ జైలు నుంచి 216 మంది ఖైదీల పరార్.. కారణమేమిటంటే
పాకిస్తాన్‌లోని కరాచీ మలిర్ జైలు నుంచి 216 మంది ఖైదీలు పరారయ్యారు. సోమవారం రాత్రి కరాచీ తూర్పు ప్రాంతాల్లో వచ్చిన స్వల్ప భూకంపం రిక్టర్ స్కేల్ పై 2.6, 2.8 నమోదైంది.

దిశ, నేషనల్ డెస్క్: పాకిస్తాన్‌లోని కరాచీ మలిర్ జైలు నుంచి 216 మంది ఖైదీలు పరారయ్యారు. సోమవారం రాత్రి కరాచీ తూర్పు ప్రాంతాల్లో వచ్చిన స్వల్ప భూకంపం రిక్టర్ స్కేల్ పై 2.6, 2.8 నమోదైంది. సర్కిల్ 4, 5ల నుంచి ఖైదీలను భద్రత కోసం బయటకు తరలించగా, అదే సమయాన్ని వాడుకున్న 216 మంది ఖైదీలు ప్రధాన గేటును బద్ధలు కొట్టుకుని పారిపోయారు. జైలు సూపరింటెండెంట్ అర్షద్ షా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ సమయంలో 600 మందికి పైగా ఖైదీలు బారక్ వెలుపల ఉన్నారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. జైలు సిబ్బంది నలుగురు గాయపడ్డారు. పరారైన ఖైదీల్లో కొంతమందిని పట్టుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మరో 135 మంది ఖైదీలు పరారీలోనే ఉన్నారు. కాగా జైలు సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో గన్ షాట్ లు వినిపించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
గేట్లు బద్దలు కొట్టుకుని పరారీ..
సింద్ రాష్ట్ర హోంమంత్రి జియా ఉల్ హసన్ ఈ ఘటనను ఇటీవలి కాలంలో అత్యంత తీవ్రమైన జైలు పరారీగా అభివర్ణించారు. సుమారు 700 నంచి 1,000 మంది ఖైదీలు గేటు వద్ద గుమిగూడిన సమయంలో గేటు ను బలవంతంగా బద్దలు కొట్టుకుని పరార్ అయినట్టు తెలిపారు. దీనికి గల కారణాలు, సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మలిర్ జైల్లో ఎక్కువగా మత్తు పదార్థాల కేసులతో సంబంధం ఉన్న ఖైదీలు ఉండగా, వారిలో పలువురు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని సింధ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఘులాం నబీ మెమన్ వెల్లడించారు. ‘భూకంపం సమయంలో గేట్లు పగలగొట్టారు. అందరూ పారిపోతుండగా నేనూ వెళ్లిపోయాను’ అని సిరాజ్ అనే తిరిగి పట్టుబడిన ఖైదీ మీడియాతో చెప్పాడు.






