Air India plane crash: విమాన ప్రమాదం.. డీఎన్ఏ పరీక్షల ద్వారా 210 మృతదేహాల గుర్తింపు.. మంత్రి కీలక అప్డేట్

by Ramesh Naini |

అహ్మాదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Air India plane crash: విమాన ప్రమాదం.. డీఎన్ఏ పరీక్షల ద్వారా 210 మృతదేహాల గుర్తింపు.. మంత్రి కీలక అప్డేట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Air India plane crash) అహ్మాదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఘటన జరిగి వారం రోజులైనా మృతుల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే గుజరాత్ మంత్రి కీలక అప్డేట్ ఇచ్చారు. (DNA tests) డీఎన్ఏ పరీక్షల ద్వారా ఇప్పటి వరకు 210 మృతదేహాలను గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రుషికేశ్ పటేల్ (Minister Rushikesh Patel) ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ (గురువారం) ఉదయం ఆయన ఎక్స్ అధికారిక ఖాతా ద్వారా వెల్లడించారు. ఇప్పటి వరకు 187 మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. డీఎన్ఏ పరీక్షలు, మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. మిగిలిన డెడ్‌బాడీలను త్వరలో అందజేస్తామని స్పష్టం చేశారు. కాగా, మృతదేహాల కోసం వారి బంధువులు ఎదురు చూస్తున్నారు.

Next Story