- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుజరాత్ అల్లర్ల కేసులో కీలక పరిణామం
గుజరాత్ అల్లర్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 69 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్ అల్లర్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2002 నాటి నారోదాగామ్ అల్లర్లలో 11 మంది చనిపోయిన కేసులో గుజరాత్‌లోని అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే మాయా కొద్నానీ, బజరంగ్ దళ్ మాజీ నాయకుడు బాబు బజరంగి సహా మొత్తం 69 మందిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఈ కేసులో నిందితులందరూ ప్రస్తుతం బెయిల్‌పై విడుదల అయ్యారు. ఈ కేసులో మొత్తం 87 మంది నిందితుల్లో 18 మంది ఈ మధ్య కాలంలో మరణించారు. విచారణ సందర్భంగా దాదాపు 182 మంది ప్రాసిక్యూషన్ సాక్షులను విచారించారు.
Next Story






