- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Electric Buses : హైదరాబాద్‌కు 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు : కేంద్రం ప్రకటన
ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ స్కీమ్(PM E-Drive Scheme) కింద హైదరాబాద్(Hyderabad)కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులను(Electric Buses) కేటాయిస్తామని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి(HD Kumara Swamy) నేడు ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ స్కీమ్(PM E-Drive Scheme) కింద హైదరాబాద్(Hyderabad)కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులను(Electric Buses) కేటాయిస్తామని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి(HD Kumara Swamy) నేడు ప్రకటించారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా రూ.11,000 కోట్లతో 14,000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రధాన నగరాలకు కేటాయించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరుకు 4,500, దిల్లీకి 2,800, అహ్మదాబాద్‌కు 1,000, సూరత్‌కు 600 బస్సులు కేటాయించారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి, కాలుష్య రహిత ప్రజా రావాణాను ప్రజలకు అందించడమే కేంద్ర ప్రభుత్వం ఈ పథకం లక్ష్యం అన్నారు.
హైదరాబాద్‌లో ఈ బస్సులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) పరిధిలో తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ(TSRTC) ద్వారా, మహాలక్ష్మి ఉచిత రవాణా పథకం సమన్వయంతో నడుస్తాయని కుమారస్వామి పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఛార్జింగ్ స్టేషన్లు, సర్వీస్ సౌకర్యాల వ్యయాలను భరిస్తాయని తెలియజేశారు. ఎలక్ట్రిక్ బస్సులతో హైదరాబాద్‌లో డీజిల్ బస్సుల వినియోగం తగ్గి, ప్రయాణీకులకు సౌకర్యవంతమైన, ఆధునిక రవాణా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.






