- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కోల్డ్‌రిఫ్’ కాఫ్ సిరప్ వ్యవహారం.. ఎట్టకేలకు ఆ సంస్థ ఎండీ అరెస్ట్
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కోల్డ్‌రిఫ్ (Coldrif) కాఫ్ సిరప్ వల్ల 20 మంది పిల్లలు మరణించిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కోల్డ్‌రిఫ్ (Coldrif) కాఫ్ సిరప్ వల్ల 20 మంది పిల్లలు మరణించిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు కాఫ్ సిరప్ తయారీ సంస్థ శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ ఎండీ రంనాథన్‌ను ఇవాళ మధ్యప్రదేశ్ పోలీసుల తమిళనాడులోని కాంచీపురంలో అరెస్ట్ చేశారు. అయితే, కోల్డ్‌రిఫ్ సిరప్‌లో 48.6 శాతం డయిత్లీన్ గ్లైకాల్ (DEG) అనే విష పదార్థం ఉన్నట్లుగా పరీక్షల్లో తేలింది. ఇది పిల్లల కిడ్నీలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని వైద్య నిపుణులు తేల్చారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోల్డ్‌రిఫ్ సిరప్‌పై పూర్తి నిషేధం విధించింది. అదేవిధంగా పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లో కూడా బ్యాన్ చేశారు. ఇక మధ్యప్రదేశ్‌లోని చింధ్వారాలో కోల్డ్‌రిఫ్ సిరప్‌లను విక్రయిస్తున్ 5 మెడికల్ స్టోన్లను కూడా సీజ్ చేసి సిరప్ శాంపిల్స్‌ను పరీక్షకు పంపారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) మొత్తం 6 రాష్ట్రాల్లో 19 ఫార్మా యూనిట్లలో ఇన్‌స్పెక్షన్లు చేపడుతోంది. కోల్డ్‌రీఫ్ కాఫ్ సిరప్ తయారు చేస్తున్న సన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీపై ఇప్పటికే FIR నమోదైంది. తమిళనాడు డ్రగ్ కంట్రోల్ అథారిటీ కోల్డ్‌రిఫ్ సిరప్‌ను ‘నాస్టాండర్డ్ క్వాలిటీ’గా సిరప్‌గా ప్రకటించింది.






