- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shopian: జమ్ముకశ్మీర్ లో ఇద్దరు హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు
జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు హైబ్రిడ్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. షోపియాన్ జిల్లాలో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు వారిని అదుపులోకి తీసుకున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు హైబ్రిడ్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. షోపియాన్ జిల్లాలో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు వారిని అదుపులోకి తీసుకున్నారు. షోపియన్ జిల్లాలోని బాస్కుచన్ ఇమామ్ సాహిబ్‌లో ఆర్మీకి చెందిన 44 రాష్ట్రీయ రైఫిల్స్, పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 178 బెటాలియన్ అధికారులు సుంయుక్త ఆపరేషన్ లో వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుండి రెండు 56 రైఫిల్స్, 4 ఏకే మ్యాగజైన్‌లు, 102 ఏకే రౌండ్లు, 2 హ్యాండ్ గ్రైనేడ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఉగ్రవాదులపై సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.
ఉగ్రదాడి..
ఇకపోతే, పహెల్గాం ఉగ్రదాడి తర్వాత ఆర్మీ అధికారులు సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి. అప్పట్నుంచి ముష్కరుల కోసం భద్రతాబలగాలు ముమ్మర ఆపరేషన్ చేపట్టారు. ఏప్రిల్ 22న పహెల్గాంలో ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులు జరిపారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ని చేపట్టింది. అందులో భాగంగా పాక్ లోని 9 ఉగ్రస్థావరాలను భద్రతాబలగాలు నేలమట్టం చేశాయి. దీంతో, పాక్ సైన్యం భారత్ పై ఎదురుదాడికి యత్నించింది. వీటిని మన బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది.






