మరో ఆలయంలో తొక్కిసటాల..ఇద్దరు మృతి

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-28 03:02:58  IST  )

ఉత్తరాఖండ్ మాససా దేవి ఆలయంలో తొక్కిసలాట మర్చిపోకముందే దేశంలో మరో ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా

మరో ఆలయంలో తొక్కిసటాల..ఇద్దరు మృతి
X

దిశ‌, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్ మాససా దేవి ఆలయంలో తొక్కిసలాట మర్చిపోకముందే దేశంలో మరో ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా మరికొందిరికి గాయాలయ్యాయి. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. యూపీలోని బారాబంకీలోని ఓ ఆలయంలో విద్యుత్ తీగ తెగిపడింది. ఆలయంలోకి కొన్ని కోతులు ప్రవేశించగా అందులో ఓ కోతి విద్యుత్ తీగను పట్టుకుని లాగటంతో అది తెగిపడినట్టు తెలుస్తోంది. దీంతో భక్తులంతా ఒక్కసారిగా ఆందోళన చెంది పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగటంతో ఇద్దరు మృతి చెంద‌గా నలభై మంది గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రావణ సోమవారం కావడంతో భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చినట్టు తెలుస్తోంది.

Next Story