18.38 లక్షల ఉపాధి హామీ పథకం కార్డులు రద్దు

by Muthe.Rajitha |

ఓవైపు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై దేశవ్యాప్యప్తంగా ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుండగానే.. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

18.38 లక్షల ఉపాధి హామీ పథకం కార్డులు రద్దు
X

దిశ, వెబ్ డెస్క్ : ఓవైపు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై దేశవ్యాప్యప్తంగా ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుండగానే.. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 18.38 లక్షల MGNREGA కార్డులు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే సాధారణంగా 3 నెలలకు ఒకసారి ఉపాధి హామీ కార్మికులను సమీక్షించి వలసదారులను, పనులకు రానివారిని, మృతులను జాబితా నుంచి తొలగించి వారి కార్డులు రద్దు చేస్తారు.

కానీ ఈ ఒక్క త్రైమాసికంలోని అక్టోబర్ 10 నుంచి నవంబర్ 14 మధ్య కేవలం 5 వారాల్లోనే 11.07 లక్షల కార్డులను తొలగించడం చర్చకు దారి తీసింది. కాగా 2025-26 కు చెందిన తొలగించిన కార్డుదారుల్లో అత్యధికంగా ఏపీకి చెందిన వారే లక్షకు పైగా ఉండటం గమనార్హం. అయితే వృద్ధులు, ఈ పని ఇష్టం లేనివారు స్వచ్ఛందంగానే వారి పేర్లు తొలగించుకున్నారని అధికారులు చెబుతున్నారు.

Next Story