- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
170 మంది మావోయిస్టులు సరెండర్.. కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్
‘ఆపరేషన్ కగార్’ ఉధృతంగా కొనసాగుతోన్న వేళ ఆయా రాష్ట్రాల్లో మావోయిస్టుల సరెండర్లు ఊపందుకున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆపరేషన్ కగార్’ ఉధృతంగా కొనసాగుతోన్న వేళ ఆయా రాష్ట్రాల్లో మావోయిస్టుల సరెండర్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలువురు అగ్ర నేతలు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. తాజాగా, ఇవాళ ఒక్కరోజే ఛత్తీస్‌గఢ్‌లో 170 మంది నక్సలైట్లు లొంగిపోగా.. మరో రాష్ట్రంలో 27 మంది ఆయుధాలు వదిలిపెట్టారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంమత్రి అమిత్ షా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు నక్సలిజం వ్యతిరేక పోరాటంలో ఇవాళ చారిత్రాత్మక రోజు అని అన్నారు. మహారాష్ట్రలో నిన్న 61 మంది సామాన్య జీవనంలోకి తిరిగి వచ్చారని పేర్కొన్నారు. గత రెండు రోజుల్లో మొత్తం 258 మంది మావోయిస్టులు హింసను విడిచిపెట్టినట్లు తెలిపారు. వారంతా భారత రాజ్యాంగంపై నమ్మకాన్ని గొప్ప చాలా విషయమని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నక్సలిజాన్ని అంతం చేసేందుకు చేస్తున్న అవిరామ శ్రమలు ఫలితాలు ఇవ్వడంతో తాము చివరి దశలో ఉన్నామని అన్నారు. సర్కార్ విధానం స్పష్టంగా ఉందని, లొంగిపోయే వారిని స్వాగతిస్తున్నామని, ఆయుధాలు చేతిలో పట్టుకునే వారిపై బలగాల కఠిన చర్య ఉంటుందని హెచ్చరించారు. ఇంకా నక్సలిజంలో ఉన్న వారిని ఆయుధాలు వదిలి సామాన్య జీవనంలోకి రావాలంటూ పిలుపునిచ్చారు. 31 మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని రూపుమాపేందుకు తాము కట్టుబడి ఉన్నామని అమిత్ షా ట్వీట్ చేశారు.






