- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tamil Nadu: తమిళనాడు జాలర్లపై శ్రీలంక సముద్రదొంగల దాడి
తమిళనాడు మత్స్యకారులపై శ్రీలంకకు చెందిన సముద్రపు దొంగలు దాడికి పాల్పడ్డారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లపై పైరెట్స్ దాడి చేశారు. ఈ ఘటనలో 17 మందికి గాయలయ్యాయి.

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు మత్స్యకారులపై శ్రీలంకకు చెందిన సముద్రపు దొంగలు దాడికి పాల్పడ్డారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లపై పైరెట్స్ దాడి చేశారు. ఈ ఘటనలో 17 మందికి గాయలయ్యాయి. నాగపట్నం జిల్లాకు చెందిన 30 మందికి పైగా జాలర్లు శుక్రవారం కోరమండల్ తీరంలో చేపలు పడుతుండగా దాడి జరిగినట్లు చెప్పారు. ఫైబర్ బోట్‌లో వచ్చిన ఆరుగురు దొంగలు మత్సకారులపై పదునైన ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. కాగా.. ఈ దాడుల్లో 17 మంది జాలర్లకు గాయాలయ్యాయని వెల్లడించారు. వారిని ఒడ్డుకు వచ్చిన తర్వాత జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ దాడి సముద్రజలాల్లోనే జరిగిందని మత్స్యకారులు పేర్కొన్నారు. అక్కడే ఉన్న పడవల్లోని వలలు, జీపీఎస్ పరికరాలను దోచుకుని వెళ్లారు. వీటి విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. కాగా.. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని జాలర్లు కోరారు. తమను ఆదుకోవాలని విన్నవించారు. ప్రస్తుతం సమ్మెలో ఉన్నామని.. ఇలాంటి దాడులు కొనసాగితే నిరవధిక సమ్మెకు వెళ్తామని మత్స్యకారులు హెచ్చరించారు. గత ఏడాది డిసెంబర్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఆ సమయంలో ముగ్గురు తమిళనాడు మత్స్యకారులు గాయపడ్డారు.






