17 మంది మావోయిస్టుల లొంగుబాటు

by Ajay Maddhiboyina |

లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులపై ఒక్కొక్కరికి రూ.1 లక్ష మేర రివార్డు ప్రకటించినట్లు ఎస్పీ జితేంద్ర కుమార్ తెలిపారు.

17 మంది మావోయిస్టుల లొంగుబాటు
X

- తొమ్మిది మందిపై రూ.24 లక్షల రివార్డు

- ఏడాదిలో 792 మంది లొంగుబాటు

దిశ, నేషనల్ బ్యూరో: నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 17 మంది లొంగిపోయి, జనజీవన స్రవంతితో కలిశారు. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో గురువారం మావోయిస్టు పార్టీకి చెందిన వారు లొంగిపోయినట్లు ఆ జిల్లా సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కాగా.. లొంగిపోయిన వారిలో తొమ్మిది మందిపై రూ.24 లక్షల నగదు రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తాజాగా లొంగిపోయిన వారిలో ఒక మావోయిస్టు జంట కూడా ఉన్నట్లు సీనియర్ పోలీసులు తెలిపారు. మావోయిస్టు భావజాలం పైనే కాకుండా.. అమాయక గిరిజనులను దోపిడీ చేయడంపై వారు అసంతృప్తి చెందారని.. పైగా ఈ ప్రాంతంలో భద్రతా దళాల ప్రభావం పెరగడంతో నిరాశ చెంది వారు పోలీసులకు లొంగిపోయినట్లు బీజాపూర్ సీనియర్ ఎస్పీ జితేంద్ర కుమార్ తెలిపారు.

నియా నెల్లనార్ (మంచి గ్రామం) అనే పథకం ద్వారా మావోయిస్టులను ఆకట్టుకున్నామని.. ఈ పథకం ద్వారా అనేక గ్రామాల్లో భద్రతా దళాలు. ప్రభుత్వం ప్రాథమిక సౌకర్యాలు కల్పించాయని జితేంద్ర కుమార్ చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులు అందరూ గంగులూరు ప్రాంత కమిటీకి చెందిన వారే అని.. అక్కడ వివిధ హోదాల్లో పని చేశారని ఆయన చెప్పారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు డివిజన్ కమిటీ సభ్యుడు దినేష్ మొడియం గతంలో 26 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఆయనపై రూ.8 లక్షల మేర రివార్డు ఉంది. మొడియం భార్య జ్యోతి (32)పై రూ.5 లక్షల రివార్డు ఉంది.

కాగా, లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులపై ఒక్కొక్కరికి రూ.1 లక్ష మేర రివార్డు ప్రకటించినట్లు ఎస్పీ జితేంద్ర కుమార్ తెలిపారు. ఈ లొంగుబాటులో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సీఆర్పీఎఫ్, కోబ్రా ముఖ్య పాత్రలు పోషించాయి.

Next Story