- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Gurmeet Ram Rahim Singh: మరోసారి పెరోల్‌పై బయటకు రానున్న డేరా బాబా
దిశ, నేషనల్ బ్యూరో: అత్యాచార కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరోసారి జైలు నుంచి బయటకు రానున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ పెరోల్‌పై బయటకు వచ్చేందుకు ఆయన చేసుకున్న విజ్ఞప్తిని భారత ఎన్నికల కమిషన్ సోమవారం ఆమోదం తెలిపింది. దీంతో గత తొమ్మిది నెలల్లో ఆయన మూడోసారి పెరోల్‌పై బయటకు వస్తుండగా, నాలుగేళ్ల క్రితం దోషిగా తేలిన తర్వాత నుంచి మొత్తంగా 15వ సారి జైలు బయటకు వస్తున్నారు. హర్యానా, పంజాబ్‌లలో ఎక్కువ ప్రాధాన్యత కలిగిన డేరా బాబా అక్టోబర్ 5 న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విడుదల కానున్నారు. గతంలోనూ మున్సిపల్, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోఅం పెరోల్‌పై బయటకు వచ్చారు. ఈసారి కూడా షరతులతో పెరోల్‌ను ఎన్నికల కమిషన్ అంగీకరించింది. ముఖ్యంగా పెరోల్ సమయంలో హర్యానాలోకి ప్రవేశించడంపై నిషేధం విధించింది. వ్యక్తిగతంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ ఎన్నికలకు సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ ఆమోదం లభించడంతో, హర్యానా ప్రభుత్వం త్వరలో డేరా బాబా విడుదల ఉత్తర్వులను జారీ చేయనుంది.