- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
150 బుల్డోజర్లు.. 2700 అక్రమ నిర్మాణాల కూల్చివేత.. (వీడియో)
అస్సాం గోల్పారా జిల్లాలోని పైకాన్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఇల్లీగల్ ప్రాపర్టీలను తొలగించారు అధికారులు. గౌహతి హైకోర్టు ఆదేశాల మేరకు సుమారు 1,038–1,040 బీఘాల (సుమారు 135–140 హెక్టార్లు) భూమిని ఖాళీ చేయడానికి బుల్డోజర్లు, ఎక్స్‌కవేటర్లు వంటి భారీ యంత్రాలను

దిశ, వెబ్ డెస్క్: అస్సాం గోల్పారా జిల్లాలోని పైకాన్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఇల్లీగల్ ప్రాపర్టీలను తొలగించారు అధికారులు. గౌహతి హైకోర్టు ఆదేశాల మేరకు సుమారు 1,038–1,040 బీఘాల (సుమారు 135–140 హెక్టార్లు) భూమిని ఖాళీ చేయడానికి బుల్డోజర్లు, ఎక్స్‌కవేటర్లు వంటి భారీ యంత్రాలను ఉపయోగించారు. దాదాపు రెండు వేలకు పైగా అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు సమాచారం. కాగా 1982లో రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించిన ఈ ప్రాంతంలో మానవ-ఏనుగు సంఘర్షణను తగ్గించి, పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడం ఈ చర్య లక్ష్యం. కాగా దీన్ని వరల్డ్ రికార్డ్‌గా చెప్తున్నారు విశ్లేషకులు.
అధికారుల ప్రకారం 2,700 నిర్మాణాలు కూల్చివేయబడగా.. సుమారు 95% మంది స్వచ్ఛందంగా ఖాళీ చేశారు. అయితే ఈ చర్య మైనారిటీలను లక్ష్యంగా జరిగిందని ఆల్ అస్సాం మైనారిటీ స్టూడెంట్స్ యూనియన్ (AAMSU) వంటి సంస్థలు నిరసనలు వ్యక్తం చేశాయి. కాగా తమ భవనాలను కూల్చొద్దని ఒకరు ఆత్మహత్యాయత్నం చేయా.. ఓ వృద్ధుడు స్ట్రోక్‌తో మరణించడం ఈ చర్యకు సంబంధించిన ఎమోషనల్ ఎఫెక్ట్‌ను సూచిస్తున్నాయి.






