ఆమ్ ఆద్మీలో తిరుగుబాటు.. ఇంద్రప్రస్థ వికాస్ పేరుతో కొత్త పార్టీ

by Ajay Maddhiboyina |

ఆమ్ ఆద్మీ పార్టీలో తిరుగుబాటు మొదలైంది. కొన్నినెలలుగా పార్టీలో అంతర్గత కుమ్ములాట

ఆమ్ ఆద్మీలో తిరుగుబాటు.. ఇంద్రప్రస్థ వికాస్ పేరుతో కొత్త పార్టీ
X

దిశ, వెబ్ డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీలో తిరుగుబాటు మొదలైంది. కొన్నినెలలుగా పార్టీలో అంతర్గత కుమ్ములాట జరుగుతోందని వార్తలు రాగా తాజాగా అది బయటపడింది. ఢిల్లో ఏకంగా పదిహేను మంది కౌన్సిలర్లు తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తమకు పని లేదని మరి ఎందుకు కౌన్సిలర్లుగా ఉండాలని ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ కౌన్సిలర్ హిమాని జైన్ మాట్లాడుతూ.. తామే కొత్త పార్టీ పెడుతున్నామని ప్రకటించారు. ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ పేరుతో పార్టీని ప్రకటించారు. ఆమ్ ఆద్మీకి రాజీనామా చేశామని అన్నారు.

గత రెండున్నర సంవత్సరాలుగా కార్పొరేషన్‌లో తాము ఎలాంటి పనిచేయలేదని చెప్పారు. ఆమ్ ఆద్మీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తమకు పనిలేదని స్పష్టం చేశారు. ఢిల్లీ డెవలప్మెంట్ కోసం తామే సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు. ఈ పార్టీ తమ ఐడియాలజీకి తగినట్టుగా ఉంటుందన్నారు. ఢిల్లీ అభివృద్ధి కోసం ప‌నిచేసే పార్టీకి తాము మ‌ద్ద‌తిస్తామ‌ని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌దిహేను మంది ఆమ్ ఆద్మీకి రాజీనామా చేసి త‌న పార్టీలో చేరుతున్నార‌ని, మ‌రికొంద‌రు కూడా పార్టీలో చేరే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

Next Story