- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kerala: దళిత అథ్లెట్ పై 60 మంది లైంగిక వేధింపులు.. 15 మంది అరెస్టు
కేరళలో(Kerala) దారుణ ఘటన బయటకొచ్చింది. 18 ఏళ్ల దళిత అథ్లెట్‌పై దాదాపు 60 మందికి పైగా వ్యక్తులు లైంగిక వేధింపుల (Sexual Abuse)కు పాల్పడ్డారు.

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలో(Kerala) దారుణ ఘటన బయటకొచ్చింది. 18 ఏళ్ల దళిత అథ్లెట్‌పై దాదాపు 60 మందికి పైగా వ్యక్తులు లైంగిక వేధింపుల (Sexual Abuse)కు పాల్పడ్డారు. కాగా.. ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీకి యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పతినంథిట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 62 మంది అనుమానితులను గుర్తించారు. వీరిలో 40 మందిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. శనివారం ఒక్కరోజే 9 మందిని అరెస్టు చేయగా.. ఇప్పటివరకు 15 మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని ప్రస్తుతం షెల్టర్ హోంకు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, బాధితురాలికి అన్నివిధాలా అండగా ఉంటామని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ వెల్లడించింది.
ఐదేళ్లుగా దారుణాలు..
అయితే, గత ఐదేళ్లుగా ఈ దారుణాలను అనుభవిస్తూ వచ్చిన ఆ యువతి.. చివరకు ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు తన ఆవేదనను పంచుంకుంది. దీంతో ఈ దారణం బయటపడింది. అయితే, 13 ఏళ్లు ఉన్నప్పుడే తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో తన ఇంటి పక్కనున్న ఓ వ్యక్తి తనను కొండల ప్రాంతానికి తీసుకెళ్లాడని, అక్కడ స్నేహితులతో కలిసి అత్యాచారానికి ఒడిగట్టాడని వాపోయింది. ఆ తర్వాత పలువురు కోచ్‌లు, తోటి ఆటగాళ్లు కూడా తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలిపింది. భయంతోనే ఇన్నాళ్లూ ఈ విషయం బయటపెట్టలేదని పేర్కొంది.






