Tahawwur Rana: 14x14 అడుగుల సెల్.. 24 గంటల నిఘా.. తహవూర్ రాణాకు కేటాయించిన గది వివరాలు ఇవే

by Prasad Jukanti |

ఎన్ఐఏ భవనంలో తహవూర్ రాణాకు సెల్ కేటాయించారు.

Tahawwur Rana:  14x14  అడుగుల సెల్.. 24 గంటల నిఘా.. తహవూర్ రాణాకు కేటాయించిన గది వివరాలు ఇవే
X

దిశ, డైనమిక్ బ్యూరో: 26/11 ముంబయి ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహవూర్ రాణాను (Tahawwur Rana) కోర్టు 18 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి (NIA Custody) అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని ఢిల్లీలోనే ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ అధికారులు రాణాకు గదిని కేటాయించారు. అత్యంత సురక్షితమైన ఆ భవనంలో రాణాకు గ్రౌండ్ ఫ్లోర్ లోని 14X14 అడుగుల ఎయిర్ కండిషన్డ్ సెల్ కేటాయించారు. ఇందులోఒక మంచం, టాయిలెట్ ఉంది. పుస్తకాలు, టీవీ సౌకర్యం కల్పించలేదు. భోజనం, తాగునీరు, వైద్య సదుపాయులు అన్ని సెల్ లోపలే అందించనున్నారు. ఈ సెల్ లోకి వెళ్లేందుకు కేవలం 12 మంది ఎన్ఐఏ అధికారులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ సెల్ లో 24 గంటల సీసీ టీవీ నిఘా ఉండనున్నది. గది బయట ఐదుగురు సాయుధ సీఆర్పీఎఫ్ కమాండోలు, ఢిల్లీ పోలీసులు నిరంతర పహార ఏర్పాటు చేశారు. తహవూర్ రాణా రాకతో ఎన్ఐఏ ఆఫీస్ ప్రతి అడుగు నిఘా రెట్టింపు చేశారు.

Next Story