ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్న 14,000 మంది 100 ఏళ్లకు పైబడిన ఓటర్లు

by Malleboina Mahesh |

బీహార్ అసెంబ్లీ ఎన్నకలు నవంబర్ నెలలో జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్న 14,000 మంది 100 ఏళ్లకు పైబడిన ఓటర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నకలు (Bihar Assembly Elections) నవంబర్ నెలలో జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, వయోపరమైన ఓటర్ల సంఖ్యలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసి తుది జాబితా డేటా ప్రకారం.. రాష్ట్రంలో 100 ఏళ్లకు పైబడిన ఓటర్లు (Voters over 100 years old) 14,000 మంది ఉన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో 85 ఏళ్లకు పైబడిన ఓటర్ల సంఖ్యలో మాత్రం గణనీయమైన తగ్గుదల కనిపించింది. 2025 జనవరి 1 నాటికి 85 ఏళ్ల పైబడిన ఓటర్ల సంఖ్య 16,07,527 ఉండగా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తర్వాత ఇది 4,03,985కి తగ్గింది.

ఈ ప్రక్రియలో మొత్తం 65 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 7.89 కోట్ల నుంచి 7.24 కోట్లకు తగ్గింది. ఈ మార్పులపై భారతీయ ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు 3.66 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగింపు వివరాలను కోరిన విషయం తెలిసిందే. ఏది ఏమైనప్పటికి ఒకే రాష్ట్రంలో 14,000 మంది 100 ఏళ్లకు పైబడిన ఓటర్లు ఉంటడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. బీహార్‌లో ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీలలో రెండు దశల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 100 ఏళ్లకు పైబడిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story