- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అమ్మా నేను చిప్స్ దొంగలించలేదు’ నోట్ రాసి 13 ఏళ్ల బాలుడి సూసైడ్.. ఎక్కడంటే?
‘అమ్మా నేను చిప్స్ దొంగలించలేదు’ అంటూ సూసైడ్ నోట్ రాసి 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. ‘అమ్మా నేను చిప్స్ దొంగలించలేదు’ అంటూ (suicide note) సూసైడ్ నోట్ రాసి 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దొంగతనం నింద తట్టుకోలేక 7వ తరగతి చదువుతున్న (Boy's suicide) బాలుడి ఆత్మహత్య పాల్పడిన ఘటన గురువారం సాయంత్రం జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని (East Medinipur) ఈస్ట్ మేదినిపూర్ నగరానికి చెందిన కృష్ణేందు దాస్ అనే బాలుడు బకుల్దా అనే పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. అదే ప్రాంతంలోని ఒక స్వీట్ షాపులో నుంచి యజమాని లేనప్పుడు మూడు చిప్స్ ప్యాకెట్లను దొంగతనం చేసినట్లు బాలుడిపై ఆరోపణలు ఉన్నాయి.
స్థానికుల కథనం ప్రకారం.. షాపులో చిప్స్ ప్యాకెట్ (Chips packet theft) దొంగిలించి తీసుకువెళ్తున్నట్లు గమనించిన దుకాణదారుడు శుభాంకర్ దీక్షిత్ నిలదీయడంతో బాలుడు డబ్బులు చెల్లించాడు. డబ్బులు చెల్లించినా కూడా వినకుండా దుకాణదారుడు బాలుడిని షాపు వద్దకు తీసుకెళ్లి కొట్టి అందరి ముందు క్షమాపణ చెప్పించి.. గుంజీలు తీయించినట్లు సమాచారం. జరిగిన విషయాన్ని బాలుడు ఇంట్లో చెప్పగా, షాపు వద్దకు వెళ్లి ఓనర్ తో బాలుడి తల్లి గొడవ పెట్టుకుంది. తర్వాత ఇంటికి వచ్చిన బాలుడు కృష్ణేందు దాస్ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బాలుడు సూసైడ్ నోట్ రాసినట్లు తల్లిదండ్రులు తెలిపారు.
అందులో ‘అమ్మా, నేను దొంగను కాను.. దొంగతనం చేయలేదు. నేను షాపు వద్ద వేచి ఉండగా మామ (దుకాణదారుడు) నా పక్కన లేడు. తిరిగి వస్తుంటే రోడ్డు మీద పడి ఉన్న కుర్కురే ప్యాకెట్‌ను చూసి దాన్ని తీసుకున్నాను. నాకు కుర్కురే అంటే చాలా ఇష్టం అని’ నోట్‌లో రాసి ఉంది. ఇక, షాప్ ఓనర్ క్రూరమైన ప్రవర్తన వల్లే తమ కుమారుడు చనిపోయాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపించారు. బాలుడి మరణం తర్వాత దుకాణదారుడు కనిపించకుండా పోయాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.






