- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్ : భారీ వర్షాల కారణంగా జన జీవనం అస్తవ్యస్తం అవుతోంది. మనుషులకే కాదు మూగజీవాలకు కూడా ప్రమాదాన్ని పెంచుతున్నాయి వరదలు. ఈ క్రమంలోనే రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్‌లోని పులులు మిస్ అయ్యాయన్న న్యూస్ వైరల్ అయింది. వరదల కారణంగా ఈ పార్క్‌లో కార్యకలాపాలన్ని స్తంభించాయని.. ఆగస్టు 28 వరకు రణథంబోర్, సరిస్కా రిజర్వ్స్‌లో పదమూడు పులులు కనిపించకుండా పోయాయని తెలుస్తోంది. దారులన్నీ వరదలతో ముంచెత్తిపోవడంతో గస్తీ ప్రయత్నాలు చేయలేకపోతున్నారు. సఫారీ మార్గాలు కూడా మూసేయడంతో రేంజర్ గస్తీ కూడా సంక్లిష్టంగా మారింది. కాగా కనిపించకుండా పోయిన పులులు.. గుహలు, ఎత్తైన ప్రాంతాలలో ఉండొచ్చని భావిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. లేదంటే మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్‌కు వలస వెళ్లొచ్చని అనుమానిస్తున్నారు.
Next Story






