- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇన్‌స్టాగ్రామ్‌లో 13 లక్షల మంది ఫాలోవర్స్.. సోషల్ స్టార్ కాదు, సైబర్ నేరస్థురాలు!
ఒకప్పుడు ఇన్‌స్టాగ్రామ్ స్టార్‌గా వెలిగిన కీర్తి పటేల్.. ఇప్పుడు హనీట్రాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా సెన్సేషన్‌గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు ఇన్‌స్టాగ్రామ్ (Instagram) స్టార్‌గా వెలిగిన కీర్తి పటేల్.. ఇప్పుడు హనీట్రాప్ (Honeytrap) కేసులో ప్రధాన నిందితురాలిగా సెన్సేషన్‌గా మారింది. స్టైలిష్ ఫొటోషూట్లు, గ్లామర్ రీల్స్‌తో నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టిన ఆమె, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 13 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించింది. కానీ అదే సోషల్ ఫేమ్‌ను ఆయుధంగా మార్చుకుని, ఓ ప్రైవేట్ బిల్డర్‌ను బ్లాక్‌మెయిల్ చేయాలని దుశ్చర్యకు పాల్పడింది. చివరకు 10 నెలలుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న కీర్తి పటేల్‌ను పోలీసులు టెక్నాలజీ సాయంతో పట్టుకున్నారు.
గుజరాత్‌లోని సూరత్‌కు (Surat) చెందిన కీర్తి పటేల్ (Keerthy Patel) ఒక ప్రైవేట్ బిల్డర్‌ను టార్గెట్ చేసింది. మొదట అతడితో స్నేహంగా ఉండి, అతడిని హనీట్రాప్ (Honeytrap) చేసింది. అనంతరం కోట్లాది రూపాయలు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడింది. బాధిత బిల్డర్ ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇందులో ఇప్పటికే నలుగురు అరెస్టు చేయగా, కీర్తి మాత్రం పరారీలో ఉంది.
2024 జూన్ 2న కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసినప్పటి నుంచి కీర్తి పరారీలో ఉంది. పోలీసులు ఆమెను పట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కానీ కీర్తి మాత్రం తెలివిగా ఒక నగరం నుంచి మరొక నగరానికి మారుతూ, సిమ్ కార్డులు, ఫోన్ ఐపీ అడ్రసులు మార్చుతూ తప్పించుకుంటూ వచ్చింది. అయితే ఆమె చివరికి అహ్మదాబాద్ శివార్లలోని సర్ఖేజ్ ప్రాంతంలో పోలీసులకు చిక్కింది. సాంకేతిక నిఘా వలన ఆమె లొకేషన్‌ను గుర్తించిన పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకుని సూరత్‌కు తరలించారు.
కీర్తి పటేల్‌పై హనీట్రాప్ మాత్రమే కాకుండా, భూకబ్జా, దోపిడీ కేసులూ ఉన్నట్లు డీసీపీ అలోక్ కుమార్ తెలిపారు. సోషల్ మీడియాలో మాయాజాలంతో అభిమానులను మెప్పించిన ఆమె.. పటిష్టమైన నిఘా ముందు నిలవలేకపోయింది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతిఒక్కరి వెనుక నిజాయితీ ఉండదని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. వ్యక్తిగత సమాచారం, సంబంధాల విషయంలో అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి అని అధికారులు ఈ సందర్భంగా సూచిస్తున్నారు.






