- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ukraine: ఉక్రెయిన్ పై విరుచుకుపడ్డ రష్యా.. 13 మంది మృతి
ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులతో విరుచుకు పడింది. ఉక్రెయిన్ నగరాలపై 367 డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడులకు పాల్పడింది. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద వైమానిక దాడి జరిగిందని నిపుణులు అంటున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులతో విరుచుకు పడింది. ఉక్రెయిన్ నగరాలపై 367 డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడులకు పాల్పడింది. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద వైమానిక దాడి జరిగిందని నిపుణులు అంటున్నారు. శనివారం అర్థరాత్రి కీవ్, ఖార్కివ్, మైకోలైవ్, టెర్నోపిల్ సహా పలు సిటీలపై దాడులు రష్యన్ బలగాలు దాడులు చేశాయి. ఈ దాడిలో ముగ్గురు చిన్నారులు సహా 13 మంది చనిపోయారు. అంతేకాకుండా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఉక్రెయిన్ వైమానిక దళం 266 డ్రోన్లు, 45 క్షిపణులను కూల్చివేసినట్లు తెలుస్తోంది. కానీ, భారీగా నష్టం సంభవించినట్లు సమాచారం. అపార్ట్‌మెంట్ బ్లాక్‌లు,మౌలిక సదుపాయాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దక్షిణ ఉక్రెయిన్‌లోని మైకోలైవ్‌లో డ్రోన్ దాడిలో 77 ఏళ్ల వ్యక్తి మరణించగా, ఐదుగురు గాయపడ్డారని ప్రాంతీయ గవర్నర్ తెలిపారు. ఈ దాడిలో ఒక అపార్ట్‌మెంట్ భవనం తీవ్రంగా దెబ్బతిందని పేర్కొన్నారు.
అమెరికాపై జెలెన్ స్కీ విమర్శలు
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో రష్యాపై బలమైన ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ డిమాండ్ చేశారు. అమెరికా స్పందించకుండా, మౌనంగా ఉన్నారని విమర్శించారు. అమెరికా సహా ప్రపంచ దేశాల నిశ్శబ్దం పుతిన్‌ను మాత్రమే ప్రోత్సహిస్తుంది" అని ఆయన టెలిగ్రామ్‌లో రాసుకొచ్చారు. రష్యా, దాని మిత్రదేశాలు పాశ్చాత్య దేశాల్లో మారణకాండను సృష్టించేందుకు మాత్రమే బలగాలను తయారు చేస్తాయని ఉక్రెయిన్ అధ్యక్షుడి చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ యెర్మాక్ అన్నారు. ఆయుధాలు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్నంత వరకు మాస్కో పోరాడుతుందని మండిపడ్డారు. మరోవైపు, వివాదం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో కేవలం నాలుగు గంటల్లోనే 95 ఉక్రేనియన్ డ్రోన్‌లను కూల్చివేసినట్లు రష్యా పేర్కొంది. మాస్కో సమీపంలో 12 డ్రోన్‌లను అడ్డగించినట్లు పేర్కొంది. శాంతి చర్చలకు మార్గం సుగమం చేయడానికి ఉక్రెయిన్ 30 రోజుల కాల్పుల విరమణ కోసం ఒత్తిడి చేస్తున్న ఈ దాడులు జరిగాయి.






