- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AAP: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. 13 మంది కౌన్సిలర్లు రాజీనామా
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు ఆపార్టీకి రాజీనామా చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు ఆపార్టీకి రాజీనామా చేశారు. ఆప్ ముఖ్యనేత ముఖేష్ గోయెల్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు.. కొత్తపార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ అనే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గతమున్సిపల్ ఎన్నికలకు ముందు ఈనేతలంతా కాంగ్రెస్ ను వదిలి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. 25 ఏళ్లుగా మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేస్తున్న గోయెల్.. 2021లో కాంగ్రెస్ నుండి ఆప్ లోకి మారారు. మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి బీజేపీ విజయం సాధించింది. దీంతో, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD)పై కాషాయ పార్టీ నియంత్రణ సాధించింది. ఇలాంటి తరుణంలో ఈ పరిణామం జరిగడం గమనార్హం. మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మున్సిపల్ ఎన్నికలను బహిష్కరించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి..
మరోవైపు, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖేష్ గోయెల్ ఆదర్శ్ నగర్ నుండి ఆప్ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీ చేతిలో ఘోర పరాజయం పాలైంది. కాగా.. ఆప్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. అప్పటి నుంచి ఆప్ అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. పార్టీలో నెలకొన్న వేబేధాలను తగ్గించేందుకు.. మార్చి నెలలో ఆప్ సంస్థాగత మార్పులు చేపట్టింది. ఆప్ ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌ను నియమించింది. పంజాబ్‌కు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బాధ్యతలు అప్పగించారు. గుజరాత్‌కు ఆప్ ఇన్‌చార్జ్‌గా గోపాల్ రాయ్‌ను, ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక ఇన్‌చార్జ్‌గా ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ ఎంపిక చేసింది.






