- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాంపియన్ప్ ట్రోఫీ కోసం భారీ భద్రత
కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్ మధ్య ప్రయాణాల కోసం 9 ప్రత్యేక చార్టడ్ విమానాలను కేటాయించింది. పాకిస్తాన్ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ (పీఏఐ) ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరిగాయి.

- మైదానాల దగ్గర 12 వేల మంది పోలీసులు
- క్రికెటర్ల కోసం 9 చార్టెడ్ ఫ్లైట్స్
దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్‌లో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఆ దేశం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. 1996లో వన్డే ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చిన పాకిస్తాన్.. 29 ఏళ్ల తర్వాత మరో ఐసీసీ ట్రోఫీకి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. పాకిస్తాన్‌లో అడుగుపెట్టడానికి భారత్ నిరాకరించడంతో టీమ్ ఇండియా మ్యాచ్‌లు మాత్రమే దుబాయ్ వేదికగా జరుగుతున్నాయి. ఒక వేళ టీమ్ ఇండియా సెమీస్‌కు అర్హత సాధిస్తే.. ఆ మ్యాచ్‌తో పాటు ఫైనల్స్ కూడా దుబాయ్‌లోనే జరగనున్నాయి. అయితే పాకిస్తాన్‌లోని కరాచీ, లాహోర్, రావల్పిండి మైదానాల్లో జరిగే మ్యాచ్‌ల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతకు సంబంధించి ఆ దేశంపై ఉన్న అపవాదును తొలగించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నడుం భిగించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించింది. లాహోర్, రావల్పిండి మైదానా్లోల దాదాపు 12,000 మంది పోలీసులను మోహరించారు. ఇందులో 200 మంది మహిళా పోలీసులు కూడా ఉన్నట్లు పీసీబీ తెలిపింది. రెండో సెమీస్‌కు వేదికగా ఉన్న లాహోర్‌లో 8 వేల మందికి పైగా సెక్యూరిటీ ఉన్నట్లు తెలిసింది. భారీ భద్రతతో పాటు ఆయా దేశాల క్రికెటర్లు, ఫ్యాన్స్ కోసం కూడా ఏర్పాట్లు చేసింది. కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్ మధ్య ప్రయాణాల కోసం 9 ప్రత్యేక చార్టడ్ విమానాలను కేటాయించింది. పాకిస్తాన్ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ (పీఏఐ) ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరిగాయి.






