11 ఏళ్ల బాలికపై దారుణం.. కిందపడిన అన్నం ఎత్తమని!?

by Jakkula.Mamatha |   (  Updated:2025-02-21 12:11:08  IST  )

ఇటీవల కాలంలో మహిళలు, బాలికలపై లైగింక వేధింపుల ఘటనలు, దాడులు వెలుగు చూస్తున్నాయి.

11 ఏళ్ల బాలికపై దారుణం.. కిందపడిన అన్నం ఎత్తమని!?
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో మహిళలు, బాలికలపై లైగింక వేధింపుల ఘటనలు, దాడులు వెలుగు చూస్తున్నాయి. బాలికలపై దాడులకు సంబంధించిన ఘటనలు నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కొందరు వ్యక్తులు మృగాల్లా ప్రవర్తిస్తూ.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చిత్రహింసలకు గురి చేస్తుంటారు. క్షణికావేశంలో వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. తాజాగా ఓ చిన్నారిపై ఓ వ్యక్తి ఇష్టమొచ్చినట్లు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని తానిసండ్ర మదర్సాలో దారుణం చోటుచేసుకుంది. కిందపడ్డ అన్నం ఎత్తలేదని 11 ఏళ్ల బాలికను నిర్వహకుడి కొడుకు మహమ్మద్ హసన్ చావబాదాడు. కింద పడిన అన్నం ఎత్తమని కోపంతో గట్టిగా అరిచాడు. ఈ క్రమంలో కోపం అణుచుకోలేక ఆమెను జాలి లేకుండా కాలితో ఎడాపెడా తన్నాడు. ఫిబ్రవరి 16వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. యశ్వంతపుర్ బాలిక 2024 నుంచి మదర్సాలో ఉంటుంది. ఈ క్రమంలో బాలిక పేరెంట్స్ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story