- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్ ఆర్మీ లక్ష్యంగా బాంబు దాడి.. 11 మంది మృతి
by Naga Rani Yarlagadda |
పాకిస్థాన్ మరోసారి బాంబు మోతతో దద్దరిల్లింది. పాక్ ఆర్మీనే లక్ష్యంగా బాంబు దాడి జరగ్గా.. సుమారు 11 మంది మరణించినట్లు సమాచారం.

X
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ మరోసారి బాంబు మోతతో దద్దరిల్లింది. పాక్ ఆర్మీనే లక్ష్యంగా బాంబు దాడి జరగ్గా.. సుమారు 11 మంది మరణించినట్లు సమాచారం. సాయుధ బలగాలు ప్రయాణిస్తోన్న వెహికల్ లక్ష్యంగా మిలిటెంట్లు బాంబు దాడి చేయగా.. ఇద్దరు అధికారులు సహా పారా మిలిటరీ సిబ్బంది చనిపోయినట్లుగా పాక్ మీడియా పేర్కొంది. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. కుర్రం జిల్లాలో పాక్ సైనిక కాన్వాయ్ పై మిలిటెంట్లు బాంబు దాడి చేశారు. అనంతరం కాల్పులు కూడా జరిపారు. ఈ దాడికి పాల్పడిన మిలిటెంట్ల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. తెహ్రీక్ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఈ దాడికి తమదే బాధ్యత అని ప్రకటించుకున్నట్లు సమాచారం. కాగా.. బాంబు దాడిపై పాక్ ప్రభుత్వం ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన చేయలేదు.
Next Story






